నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు

by CNN TELUGU
0 comment

ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ – కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తాం: ఎపి డీజీపీ


ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిత్యం 18 గంటల పాటు కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని హెచ్చరించారు. ఇక, అత్యవసర ప్రయాణికుల కోసం సోమవారం (మే 10) నుంచి ఈ-పాస్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని ఈ- పాస్‌ పోలీస్‌ సేవ ‘యాప్’ ద్వారా వినియోగించుకోవాలని సూచించారు.

తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని సవాంగ్ పేర్కొన్నారు. శుభకార్యాలకు అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి పొందాలని, కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని తెలిపారు.

ఎవరైనా కరోనా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే డయల్ 100, 112లకు సమాచారం అందించాలని సూచించారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు షరతులు కొనసాగుతాయని తెలిపారు.

Related Posts

Leave a Comment