టీటీడీ బోర్డు సభ్యుడిగా ఒకే పేరుతో తెరపైకి ఇద్దరు…

by CNN TELUGU
0 comment

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో రాజేశ్ శర్మ అనే మహారాష్ట్ర వ్యక్తిని సభ్యుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోట్ ఇప్పుదు టీటీడీకి కొత్త చిక్కుని తెచ్చిపెట్టింది. రాజేశ్ శర్మ అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు టీటీడీ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరి చేత ప్రమాణస్వీకారం చేయించాలో తెలియక టీటీడీ అధికారులు అయ్యోమయంలో పడ్డారు.

టీటీడీ ధర్మకర్తల మండలిలో రాజేశ్‌ శర్మ పేరుతో ఏర్పడిన సంధిద్గంపై బిజేపి నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 36 మందితో ఏర్పాటైన బోర్డులో ఇప్పటికే 24 మంది సభ్యులు, ఆరుగురు ప్రత్యేక ఆహ్వానితులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా సభ్యుల్లో డీపీ అనంత, సుధా నారాయణమూర్తి, రాజేశ్‌శర్మ, రమేశ్‌ శెట్టి, ప్రత్యేక ఆహ్వానితుల్లో గోవిందహరి (హైదరాబాద్‌) ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.

దీనిపై ఏ.పి బిజేపి అధికార ప్రతినిధి ఎస్. శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డిలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జంబో బోర్డులో నియమించిన సభ్యుల ఊరు పేరు తెలికుండానే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరాలు వచ్చాక చర్యలు తీసుకుంటామని టిటిడి అధికారులు చెబుతున్నారు.

Related Posts