ఏపి ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఎల్.వి సుబ్రహ్మణ్యం బదిలీ

by CNN TELUGU
0 comment

అమరావతి, నవంబర్, 4 : రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఎల్.వి సుబ్రహ్మణ్యం ను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేసారు.

సిఎస్ గా అదనపు బాధ్యతలను చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మిషన్ విభాగపు అధికారికి అప్పగించారు. ఎల్.వి సుబ్రహ్మణ్యం ను గుంటూరు జిల్లా బాపట్లలో ని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. తన బాధ్యతలు తక్షణమే సీసీఎల్ ఎ కు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఈ  ఉత్తర్వులు విడుదలైన మరుక్షణమే అదనపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. సిఎస్ బదిలీ పై రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. మరో 5 మాసాలు ఉండగానే బదిలీ చేసింది.

Related Posts