ఆ ఇద్దరు ‘ట్వీట్లుతో స్వీట్లు’ పంచుకుంటున్నారు

by CNN TELUGU
0 comment

రాష్ట్రంలో జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక తండ్రీకొడుకులు ట్వీట్లుమీద స్వీట్లు కొడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు.

దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులను అడ్డుకున్నట్లు, జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం తాదేపల్లిలోని రాష్ట్ర వై.ఎస్.సి.పి. కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ రాష్ట్రాన్ని 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు ప్రతి క్షణం జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు పాలనలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

పొలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 780 కోట్ల ప్రజా ధనాన్ని సీఎం ఆదా చేశారని, ఆ ప్రక్రియ విజయవంతమైందని అంబటి వ్యాఖ్యానించారు. గత పీపీఎల్లో వందల కోట్లు కమీషన్ పేర్లతో నొక్కేసారని అంబటి విమర్శించారు. పీపీఏ ద్వారా ఏడాదికి రూ. 2500 కోట్లు నష్టం ప్రభుత్వానికి వస్తోందని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీకి జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధమని అంబటి ప్రశ్నించారు.

40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబుకు అక్రమ ఇంట్లో ఉంటున్నా సిగ్గు అనిపించడం లేదా..? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదని, అనుమతి లేని లింగమనేని గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు ఎందుకు ఉన్నారని అంబటి ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

చంద్రబాబు విషం కక్కే కార్యక్రమానికి ఎల్లో మీడియా వంతపాడుతోందని.. ఎల్లో మీడియాతో ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం తండ్రి కొడుకులు చేస్తున్నారని,చంద్రబాబు పిల్లిలా అరిస్తే పులిలా గాండ్రించారని ఎల్లో మీడియా మొదటి పేజీలో వార్తలు రాస్తున్నాయని అంబటి ధ్వజమెత్తారు.

Related Posts