బాబుపై సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు

by CNN TELUGU
0 comment

చంద్రబాబు ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నారో..?
లింగమనేని గెస్ట్ హౌస్ వివాదంపై కీలక వ్యాఖ్యలు

అద్దె ఇంటితో సమస్య వస్తే ఖాలీ చేయటమే మంచిదని నేనైతే ఆ ఇంట్లో ఉండనని చంద్రబాబు అక్కడే ఎందుకు ఉంటుంన్నారో తనకు తెలియదని ఈ విషయంలో చంద్రబాబు సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని లింగమనేని గెస్ట్ హౌస్ వివాదంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈవిషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయంతో ముందుకెళితే బాగుంటుందని ఆయన అన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీలు ఒకేరకంగా వ్యవహరిస్తున్నాయని, ప్రతిరోజూ ఇరుపక్షాలకు ఇదే సమస్యగా మారిందని సుజనా విమర్శించారు. ఇక రివర్స్ టెండరింగ్‌పై మాట్లాడుతూ.. టెండర్ విదానంలో కనీసం ఇద్దరు లేకుండా ఒక్కరే పాల్గొనడంపై అనుమానం వ్యక్తం చేసారు.

Related Posts