సీఎంగా స్టాలిన్… ముహూర్తం ఖరారు

by CNN TELUGU
0 comment

చెన్నె: డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్‌ శాసనసభ పక్షనేతగా ఎన్నికయ్యారు. 10 ఏళ్ల తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధికారం చేపట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటుచేయాలని గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌ స్టాలిన్‌కు ఆహ్వానం పంపారు.

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా తొలిసారి స్టాలిన్‌ ఈనెల 7వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు కొద్దిమంది సమక్షంలోనే గవర్నర్‌ నివాసం రాజ్‌భవన్‌లో స్టాలిన్‌ ప్రమాణం చేయనున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తన మిత్రపక్షాలతో కలిసి అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ కన్నా అధిక సీట్లు ఉన్న డీఎంకేను అధికారం చేపట్టాలని గవర్నర్‌ ఆహ్వానించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

అంతకుముందు బుధవారం ఉదయం స్టాలిన్‌ తమ ఎమ్మెల్యేలంతా తనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న పత్రాన్ని గవర్నర్‌కు అందించారు.
స్టాలిన్‌తో పాటు కొద్ది మంది మంత్రులు మాత్రమే ప్రమాణస్వీకారం చేయనున్నారని డీఎంకే అధికారికంగా ప్రకటించింది.

Related Posts

Leave a Comment