ఏపీ హైకోర్టు ఎన్నికలపై సంచలన తీర్పు

by CNN TELUGU
0 comment

అమరావతి : ఏపీ హైకోర్టు ఎంపీటీపీ, జెడ్పీటీసీ ఎన్నికలపై శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. పరిషత్ ఎన్నికల రద్దు చేస్తూ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదని తీర్పులో స్పష్టం చేసింది. జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి ఈ మేరకు తీర్పును వెలువరించారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఫాలో కాకుండా ఎన్నికలు జరిగాయన్న ప్రతిపక్షాల వాదనకు హైకోర్టు మొగ్గుచూపింది.. పరిషత్ ఎన్నికలలో నిబంధనలు పాటించలేదని బిజెపి, జనసేన, టిడిపి పార్టీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్
జడ్జ్ .. ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ ఏప్రిల్ 6న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిని ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు.                

ఏప్రిల్ 7న విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ధర్మాసనం షెడ్యూల ప్రకారం ఏప్రిల్ 8న ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చింది.          

అయితే, ఓట్ల లెక్కింపు పక్రియను నిలివేయాలని.. వ్యాజ్యంపై లోతైన విచారణ జరిపే వ్యవహారాన్ని సింగిల్ జడ్జికి అప్పగించింది.

గతంలో నామినేషన్ల దాఖలు సమయంలో బలవంతపు ఉపసంహరణలు, హింసాత్మక
ఘటనల నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాలని కోరుతూ జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ నేత పాతూరి నాగభూషణం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు
చేశారు.                          

టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దాఖలు చేసిన మూడు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి మే 4న విచారణ జరిపి తీర్పును రిజర్వు చేశారు.

తాజాగా, తీర్పును వెలువరించిన కోర్టు.. నోటిఫికేషన్ చెల్లదని స్పష్టం చేసింది.

అయితే గత నెల ఏప్రిల్ 1న ఆంధ్రప్రదేశ్ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ…. అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. 2020లో ఎన్నికలు ఎక్కడ నిలిచిపోయాయో అక్కడి నుంచే తిరిగి ప్రారంభించాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో 515 జెడ్పీటీసీ, 72 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 8న ఎన్నికలు జరిగాయి. అదే నెల 10వ తేదీన కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు కౌంటింగ్ పై స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ జరిపిన కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్ళాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది

Related Posts

Leave a Comment