ఎంపీ కృష్ణంరాజు అరెస్టుకు కారణాలు.. ఏ.పీ సీఐడీ

by CNN TELUGU
0 comment

నరసాపురం వైఎస్సార్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టుపై ఏపీ సీఐడీ అధికారికంగా తెలిపింది.

వైఎస్సార్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును శుక్రవారం మధ్యాహ్నం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లోని ఎంపీ రఘురామ ఇంటిపై ఒక్కసారిగా దాడి చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐడీ శుక్రవారం రాత్రి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.

ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై 124 ఐపీసీ-ఏ సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయితే ఆయనపై సీఆర్ పీసీ 50 (2) ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగే ఇతరులతో కలిసి కుట్ర (120 బీ) చేశారని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు (124 ఏ) చేశారని, ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా వ్యాఖ్యలు (153 ఏ) చేశారని, వ్యక్తిగత దూషణ (505)లకు పాల్పడ్డారని, కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అంతేకాకుండా న్యూస్ ఛానళ్లు, వ్యక్తులతో కలిసి విద్వేషాలు రెచ్చగొట్టే ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని అభియోగాలు మోపి వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఏడీజీ పీవీ సునీల్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ నిర్వహించి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే ఎంపీ రఘురామను అరెస్టు చేసినట్లు సీఐడీ ప్రకటించింది.

అనంతరం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టుపై ఆయన తరఫు న్యాయవాదులు శుక్రవారం రాత్రి హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం అరెస్ట్ జరగలేదని, రఘురామకు అనారోగ్య సమస్యలున్నాయని పిటిషన్‌లో రఘురామ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపాల్సి ఉంది.

Related Posts

Leave a Comment