కృష్ణపట్నం మందు పై త్వరగా నివేదిక ఇవ్వండి

by CNN TELUGU
0 comment

ఆయుష్ ఇన్ ఛార్జ్ మంత్రి, ఐ.సి.ఎం.ఆర్. డైరక్టర్ జనరల్ తో మాట్లాడిన ఉపరాష్ట్రపతి

నెల్లూరు ఆయుర్వేద మందు మీద అధ్యయనం చేయాలని సూచన

నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆయుష్ ఇన్ చార్జ్ మంత్రి కిరణ్ రిజ్జు, ఐ.సి.ఎం.ఆర్. డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్ కు సూచించారు.

నెల్లూరు ఆయుర్వేద మందు విషయంలో నెలకొన్న పరిస్థితులు ఉపరాష్ట్రపతి దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన వెంటనే కేంద్ర మంత్రి మరియు డైరక్టర్ జనరల్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు.

వెంటనే ఆ మందు మీద అధ్యయనం ప్రారంభించి, వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.

అయితే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణ పట్నంకు చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందు పై విచారణ చేయమని ఐ సి ఎం ఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన కోరారు.
ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఐ సి ఎం ఆర్ అధికారులు ఇప్పటికే నెల్లూరు చేరుకుని ఆయుర్వేద మందు పై అధ్యయన ప్రారంభించారు.

Related Posts

Leave a Comment