చెట్టుపైన క్వారంటైన్

by CNN TELUGU
0 comment

నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండలం, కోతనందికొండ గ్రామంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇంట్లోవారికి తమ వల్ల కరోనా వస్తుందేమో అన్న భయంతో.. చిన్నఇల్లు కావటంతో ఇంట్లో ఉండే అవకాశం లేకపోవడంతో.. ఇంటి ముందు ఉన్న చెట్టు మీద నివాసం ఏర్పరుచుకున్నాడు రామవత్ శివ అనే యువకుడు.

కుటుంబ సభ్యులు నలుగురు ఇంట్లోనే ఉంటుండగా.. శివ మాత్రం ఇంటి ముందున్న చెట్టు పైన మంచంతో నివాసం ఏర్పరుచుకుని అక్కడే గత తొమ్మిది రోజులుగా ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు తాగునీరు, భోజనం కింది నుంచి అందిస్తున్నారు. ఇంట్లో ఒకటే రూమ్ కావడంతో.. వసతి లేక ఇలా ఉంటున్నట్టు కరోనా బాధితుడు చెబుతున్నాడు.

Related Posts

Leave a Comment