నడిరోడ్డుపై ఎంపీ అడ్డుకున్న పోలీసులు..

by CNN TELUGU
0 comment

గాంధీ ఆస్పత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని రేవంత్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం గాంధీ ఆస్పత్రికి వెళ్తున్న రేవంత్ ను బేగంపేట వద్దే పోలీసులు అడ్డుకోవడంతో ఎంపీ రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.

సోనియాగాంధీ, రాహుల్ ఆదేశాల మేరకు కరోనా రోగులకు అన్నదానం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతీరోజు వెయ్యి మందికి ఉచిత భోజన కార్యక్రమాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి మొదలు పెట్టారు.

అయితే ఉచిత భోజనం అందించటానికి ఆదివారం గాంధీ ఆస్పత్రికి వెళ్తున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని బేగంపేట వద్ద పోలీసులు అడ్డుకుని బ్రేక్ వేశారు.

దీంతో రేవంత్ రెడ్డి పోలీసులు మరియు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భోజన సరఫరా కార్యక్రమానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. అక్కడి నుండి ఫోన్ లో పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. అయినా ఎంపీకి అనుమతి లభించలేదు. అయితే ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

ప్రభుత్వం రూ. 5 భోజనాన్ని ఎత్తివేసిన నేపథ్యంలో కరోనా పేషంట్లతో పాటు.. సిబ్బంది, పేషెంట్ల బంధువులకు సకాలంలో సరైన ఆహారం దొరకడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో గాంధీ ఆస్పత్రి వద్ద వెయ్యి మందికి ప్రతిరోజు ఉచితంగా ఆహారం పంపిణీ చేసేందుకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం భోజనాన్ని తీసుకువెళ్లేందుకు ఎంపీతో పాటు కాంగ్రెస్ నేతలు గాంధీ ఆస్పత్రి వైపు వెళ్లడంతో వారిని పోలీసులు బేగంపేట వద్ద అడ్డుకున్నారు.

Related Posts

Leave a Comment