పల్నాడు ఒక మంచి నాయకుడిని కోల్పోయింది – రాయపాటి

by CNN TELUGU
0 comment

మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ మృతితో పల్నాడు ప్రాంతం ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని మాజీ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు.

శనివారం నాడు నరసరావుపేట పట్టణంలో కోడెల శివప్రసాద్ కుటుంబసభ్యులను రాయపాటి పరామర్శించారు. తొలుత ఈ నెల 30వ తేదీన డాక్టర్ కోడెల శివప్రసాదరావు సంతాప సభ ఏర్పాట్లను డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుతో కలిసి ఆయన పరిశిలించారు.సంతాపసభ కార్యక్రమంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని స్థానిక నాయకులను రాయపాటి కోరారు. అనంతరం పట్టణంలోని కోడెల నివాసమయిన కోటలో ఆయన కుమారుడు శివరాంను పరామర్శించారు. ఈ సందర్భంగా నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో ఒక బలమైన నాయకుని కోల్పోయామని, నరసరావుపేట,సత్తెనపల్లి నియోజకవర్గంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు చేసిన అభివృద్ధి ప్రజలు మరచిపోరు అని అలాంటి నాయకుడు ఈరోజు మన ముందు లేనందుకు చాలా బాధగా ఉందని ఆయన అన్నారు.

అదేవిధంగా నరసరావుపేట నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి డాక్టర్ అరవింద్ బాబు మాట్లాడుతూ సోమవారం రోజు నరసరావుపేట SS&N కాలేజీలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు సంతాప సభ నిర్వహించడం జరుగుతుందని.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వేల్పుల సింహాద్రి యాదవ్,వల్లెపు నాగేశ్వరరావు, నల్లపాటి రాము, అమర్నాధ్, మాజేటి వెంకటేష్, గంగుల పెద్దిరెడ్డి, కొల్లి బ్రహ్మయ్య, పులిమి రామిరెడ్డి,వాసిరెడ్డి రవి,కృష్ణా,వడ్లమూడి శివరామయ్యా, తదితరులు పాల్గొన్నారు.

Related Posts