ఏపీలో అర్చకులు, పాస్టర్లు, ఇమాంలకు భారీగా వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు..

by CNN TELUGU
0 comment

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంచారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అర్చకులు, ఇమాంలు, పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచుతూ జగన్ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.


రాష్ట్రంలో మతసమరస్యాన్ని మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హిందూ ఆలయాలకు సంబంధించి.. కేటగిరి-1 దేవస్థానాలలో పనిచేసే అర్చకుల గౌరవ వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ. 15,625కు, కేటగిరి-2లో అర్చకుల గౌరవ వేతనాన్ని, మసీదులో పనిచేసే ఇమాంలకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.


అలాగే, ముసీదుల్లో పనిచేసే మౌజాంలకు గౌరవ వేతనాన్ని రూ. 3 వేలు నుంచి రూ. 5 వేలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అలాగే చర్చిల్లోని పాస్టర్లకు గౌరవ వేతనంగా ఇకపై రూ. 5 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.

Related Posts

Leave a Comment