సిబిఐ డైరెక్టర్ ఎంపికలో తెరపైకి కొత్త నిబంధన..!

by CNN TELUGU
0 comment

సిబిఐ డైరెక్టర్ ఎంపికలో కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలైంది. కొత్త డైరెక్టర్ ఎంపికను మంగళవారం సాయంత్రంలోపు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. సీబీఐ తదుపరి చీఫ్ ను నియమించేందుకు సోమవారం ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి కమిటీ సమావేశమైంది. ఈ కమిటీలో ప్రధానితో పాటు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్ సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి (కాంగ్రెస్) సభ్యులుగా పాల్గొన్నారు.

కాగా, సీబీఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఒక కొత్త నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు.

నిబంధంన ప్రకారం ఏ ఐపీఎస్ అధికారి అయినా కనీసం ఆరు నెలల పాటు పదవీకాలం మిగిలి ఉంటేనే వారు పోలీస్ చీఫ్ పదవులకు అర్హులని సీజేఐ రమణ తెలిపారు.

ఐపీఎస్ అధికారి ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు గతంలోనే ఈ మేరకు తీర్పును వెల్లడించిందని గుర్తు చేశారు. ఆ నిబంధనను ఇప్పుడు కూడా సెలెక్షన్ ప్యానెల్ కచ్చితంగా అమలు చేయాలని వివరించారు. సీజేఐ లేవనెత్తిన ఈ పాయింట్ కు అధిర్ రంజన్ చౌధురి మద్దతు కూడా తెలిపారు.

1984-87 మధ్య బ్యాచ్ లకు చెందిన మొత్తం 109 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు సీబీఐ డైరెక్టర్ పదవి కోసం పరిశీలనలోకి వచ్చాయి.

సోమవారం మధ్యాహ్నానికి మధ్యాహ్నం వీరిలో 10 మంది రేసులో నిలిచారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు జరిగిన పరిశీలనలో ఆరుగురి పేర్లను తొలి జాబితాగా ఎంపిక చేశారు.

ప్రస్తుతం ముందు వరుసలో మహారాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ జైశ్వాల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సశాస్త్ర సీమా బల్ కేఆర్ చంద్ర మరియు కేంద్ర హోం శాఖ స్పెషల్ సెక్రటరీ వీఎస్కే కౌముదు ఉన్నారు.

వీరిలో సుబోధ్ కుమార్ అత్యంత సీనియర్ కావడం గమనార్హం. ఈయననే తదుపరి సీబీఐ చీఫ్ గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు ఉన్నత వర్గాల సమాచారం.

Related Posts

Leave a Comment