జగన్ గారూ.. ‘సీఎంను కాల్చి చంపాలన్న మిమ్మల్ని ఏం చేయాలి’..!

by CNN TELUGU
0 comment

ప్రజా సమస్యలు పరిష్కరించే సత్తా లేక మా నాయకుల ప్రెస్ మీట్లపై కులమతాల పేరుతో కేసులు పెడతారా.. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డుమీద కాల్చి చంపాలి అని అన్న మిమ్మల్ని ఏం చెయ్యాలి జగన్ గారూ

అయ్యన్నపై కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో మండిపడ్డారు.టీడీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసులతో వేధిస్తున్నారని..కేసులు పెట్టి పారిపోవద్దన్నారు.మీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని అన్నందుకే అయ్యన్నపాత్రుడి గారి మీద మీరు కేసు పెడితే,ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డుమీద కాల్చి చంపాలి అని అన్న మిమ్మల్ని ఏం చెయ్యాలి జగన్ గారూ? ఉరితియ్యాలా?’అని ప్రశ్నించారు.

Related Posts