బయోడైవర్సిటీ కారు ప్రమాదంపై స్పందించిన మంత్రి కేటీఆర్

by CNN TELUGU
0 comment

నూతనంగా ప్రారంభించిన హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైన కేవలం 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలని అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.

కానీ ప్రమాదం జరిగిన సమయంలో కారు 100 కిలోమీటర్ల వేగం వెళుతోందని ఆయన తెలిపారు. ఈ ఫ్లైఓవర్ పై 40 కిలోమీటర్ల వేగం మించకూడదని హెచ్చరిక బోర్డులు తెలుపుతున్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించడం విషాదకరమని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై విచారణ జరిపి ఫ్లైఓవర్ డిజైన్ లో ఏమైనా లోపాలున్నాయేమోనని పరిశీలిస్తామని ఏమైనా లోపాలున్నట్లయితే వాటిని మార్పులు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Related Posts