ఆక్సిజన్ కోసం 310 కోట్లతో చర్యలు

by CNN TELUGU
0 comment

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ బారిన పడిన రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందించేందుకు 50 క్రాయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ల కొనుగోలుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక సుమారు 310 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు ఇస్తూ.. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఈ చర్యల్లో భాగంగా 49 ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లకు పైపులైన్ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేపట్టింది. దీనికోసం సివిల్, ఎలక్ట్రికల్ పనులకు, 10వేల ఆక్సిజన్ పైపులైన్ల ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాకు నెలకు 10 లక్షలు చొప్పున ఆక్సిజన్ పైపులైన్‌ మెయింటెనెన్స్‌కు .. 6 నెలలకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Related Posts

Leave a Comment