తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు : కె సి ఆర్

by CNN TELUGU
0 comment

తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్ డౌన్ ను ఈ నెల 30 తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన మేరకు సీఎం కేసీఆర్ లాక్ డౌన్‌ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.

మే 12 నుంచి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి (మే 12 నుంచి 21 వరకు) పదిరోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది

ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు.
కరోనా నియంత్రణా కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా ఉన్నందున ఈ నెల 20 న జరపతలపెట్టిన క్యాబినెట్ సమావేశాన్ని సీఎం కె సి ఆర్ రద్దు చేశారు.

Related Posts

Leave a Comment