గల్లీలో మళ్ళీ మళ్ళీ ‘పెళ్ళిలా’.. ట్విట్టర్ లో లోకేష్

by CNN TELUGU
0 comment

‘గల్లీలో మళ్ళీ మళ్ళీ పెళ్ళిలాగా… తెదేపా రద్దు చేసిన బాక్సయిట్ తవ్వకాలని మళ్ళీ రద్దు చేయడం, తెదేపా భూమిపూజ చేసిన టీసీఎల్ కి మళ్ళీ భూమిపూజ చేయడం, తెదేపా తెచ్చిన కియా సంస్థ 15 ఏళ్ళ క్రితం మా తండ్రిగారి కృషి మూలంగానే వచ్చిందనడం, పోలవరం కట్టింది మా తండ్రే అనడం… ఏమిటో ఇదంతా?’అంటూ ట్విట్టర్ లో లోకేష్ చురకలు అంటించారు.

‘వైసీపీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు లెండి.. జగన్ గారు సొంతంగా ఏదైనా చేస్తే ఏంటీ తుగ్లక్ పనులు అని ప్రజలంటున్నారు. అందుకే తెదేపా చేసిన మంచిపనులనే మళ్ళీ చేసి, లేదా మనమే చేశామని చెప్పుకుంటే బెటర్ కదా అనుకుంటున్నారు. ఎవరేం చేయగలరో ప్రజలకు తెలుసు కదా’అన్నారు లోకేష్.
ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా టీసీఎల్ కంపెనీకి భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ జగన్ సర్కార్‌ను టార్గెట్ చేసింది. 2018లోనే తిరుపతిలో టీసీఎల్ కంపెనీకి భూమిపూజ చేస్తే మళ్లీ రోజా ఇప్పుడు కొత్తగా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు. సోషల్ మీడియాలో రోజా, ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా స్పందించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై సెటైర్లు పేల్చారు.

Related Posts