మాటలకందని దారుణం.. కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

by CNN TELUGU
0 comment

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డిని పట్టపగలే సజీవ దహనం చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు.

విజయారెడ్డి దుర్మార్గమైన హత్య.. మాటలకందనిరీతిలో తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. సమస్య ఏదైనా ఉండొచ్చు కానీ.. ఇలా అమానుషంగా దాడి చేయడం మాత్రం అత్యంత హేయమని, ఇలాంటి ఘటనలకు ప్రజాస్వామ్యంలో తావులేదని ఆయన స్పష్టం చేశారు. తాహశీల్దార్‌ విజయారెడ్డి కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్‌ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయరెడ్డిపై సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్‌ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు.  ఆమెను కాపాడాటానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తహశీల్దార్‌ కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది.

తహశీల్దార్‌ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన వ్యక్తిని కూర సురేశ్‌ ముదిరాజ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Related Posts