నేను ఆరోగ్యంగానే ఉన్నా.. చంద్రమోహన్

by CNN TELUGU
0 comment

తనకు బాగోలేదని వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని, ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందిని ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ చెప్పారు.

అద్భుతమైన నటుల్లో ఒకరైన చంద్రమోహన్.. ఎన్టీఆర్, ఏఎన్నార్ రాజ్యమేలుతున్న కాలంలో యువకుడిగా చిత్రసీమలోకి ప్రవేశించి హీరోగా ఎన్నో విజయాలను అందుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలు గడుస్తున్నా ఆయన సినీ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కొన్ని సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంటున్నారు. ప్రధానపాత్ర అయినా.. సహాయక పాత్రలో అయినా.. హీరోగా అయినా.. కమెడియన్‌గా అయినా చంద్రమోహన్‌ ఎంతోమంది అభిమానం సంపాదించుకున్నారు. హీరోగా 175కు పైగా సినిమాలు చేసిన ఆయన మొత్తం 932 సినిమాల్లో నటించారు.

అయితే, చంద్రమోహన్ ఆరోగ్యం బాగోలేదని ఈ మధ్యన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఆయన స్వయంగా స్పందిస్తూ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.

తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అందరి అభిమానమే తనకు శ్రీరామ రక్షని
తనకు ఆరోగ్యం బాగోలేదని వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని చంద్రమోహన్ తెలిపారు.

Related Posts

Leave a Comment