హుజూర్ నగర్ కేసీఆర్ సభ రద్దు

by CNN TELUGU
0 comment

హుజూర్‌నగర్‌లో గురువారం జరగాల్సిన టిఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభ రద్దు అయినది. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని..మాట్లాడాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. అంతే కాదు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో హెలీకాప్టర్ లో సభకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ కు అనుమతి ఇవ్వలేదు ఏవియేషన్ శాఖ.

సీఎం కేసీఆర్ సభలో పాల్గొననుండటంతో టిఆర్ఎస్ నాయకులు హుజూర్ నగర్ నుంచి భారీగా జన సమీకరణ చేశారు. అయితే సభా ప్రాంగణంలో భారీగా మేఘాలు కమ్ముకోవడంతో పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నభారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. దీంతో హుజూర్ నగర్ టిఆర్ఎస్ శ్రేణులు నిరాశకు లోనయ్యారు.

Related Posts