రైల్వే శాఖ భారీ షాక్..

by CNN TELUGU
0 comment

దసరా పండుగ నేపథ్యంలో రైల్వే శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఈ రోజు నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.30 వసూలు చేస్తారు.

అక్టోబర్ 10 తర్వాత మళ్లీ పాత రేట్లనే అమలు చేస్తారు. ప్రయాణికుల రద్దీ అంతా ఇంతా ఉండదు. సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారితో వాహనాలు క్రిక్కిరిసిపోతుంటాయి. ఇక రైళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. సాధారణంగా ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 ఉంది. అయితే, ఈ రోజు నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.30 వసూలు చేస్తారు. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల ధరలు పెంచింది. అయితే కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి స్టేషన్లలో ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.

Related Posts