ఆయన ‘ఓ రౌడీ’..

by CNN TELUGU
0 comment
  • కోడెలకు రౌడీ కొడుకు…
  • ఓ పనికిమాలిన కూతురు ఉన్నారన్నారు..
  • లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు లక్ష్మీ పార్వతి..!

పుత్రప్రేమను అధికంగా చూపించేవాడు ఎలా నష్టపోతాడన్న దానికి మహాభారతంలో దృతరాష్ట్రుడు ఉదాహరణగా మిగిలాడని ఆ తర్వాత కోడెల శివప్రసాద్ మనకు మంచి ఉదాహరణ అని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆమె తాడేపల్లి వై.సి.పి.రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కోడెలతో పాటు ఆయన కుటుంబంపై ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొడెలకు ఓ రౌడీ కొడుకు, పనికిమాలిన కూతురు ఉన్నారన్నారు. ఆయనకు ఉన్న కొడుకు, కూతురు లాంటి వ్యక్తులు మరెవరికి ఉండకూడదన్నారు. కోడెల ఏం తప్పు చేయలేదా ? ఆయన కుటుంబం కూడా ఏ తప్పు చేయలేదా అని ఆమె ప్రశ్నించారు. అలాంటి సంతానం మరెవరికి ఉండకూడదన్నారు. ఆయన స్వతహాగా మంచివాడైనా కొడుకు కూతురు వల్లే తీవ్రంగా నష్టపోయారన్నారు. కోడెల స్పీకర్ పదవికే మచ్చ తెచ్చారన్నారు.

ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు ఒకే రకమైన రాజకీయాలు చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. కోడెల చావును కూడా చంద్రబాబు రాజికీయం చేశారని ఆమె విమర్శలు గుప్పించారు. చనిపోయిన తర్వాత మాత్రం కోడెల శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారన్నారు. నీచమైన కుట్రలు చంద్రబాబు ఇక ఆపరా.. అంటూ లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు.

Related Posts