ఆయనకు ‘ఆది’ లోనే అడ్డుతగిలారు

by CNN TELUGU
0 comment

బీజేపీలోకి రాకుండా మాజీమంత్రికి బ్రేకులు..
వారం పాటు ప్రయత్నించారు..

ఏపీకి చెందిన మాజీమంత్రి, కడప జిల్లా సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరతారనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. మిగతా నేతలంతా కాషాయ కండువా కప్పుకుంటున్నా.. ఆదినారాయణరెడ్డి మాత్రం బీజేపీలో చేరే విషయంలో ఇంకా వెయిటింగ్‌లోనే ఉన్నారు.

దీంతో అసలు ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరే విషయంలో ఏం జరుగుతోందనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి.. టీడీపీలో చేరి మంత్రి అయ్యి కడప జిల్లా టీడీపీలో చక్రం తిప్పారు. చంద్రబాబుకు ముఖ్యుల్లో ఒకరిగా మారిపోయారు.

ఎన్నికల తరువాత టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్న ఆయనకి ఒకప్పటి రాజకీయ విరోది అయిన ఇప్పటి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి రానీయకుండా అడ్డుతగులుతున్నారానే చర్చ కడప జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా లేదా పార్టీ చీఫ్ అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లిన ఆదినారాయణరెడ్డి వారం రోజుల పాటు అక్కడే వుండి ప్రయత్నించారు.

అపాయింట్ మెంట్ రాకపోవటంతో చేసేది లేక తిరిగొచ్చారని కడప జిల్లా రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న రాజకీయ చర్చ. దీనంతటకి కారణం ఎంపీ సీఎం రమేశ్ అనే ప్రచారం జిల్లా కొనసాగుతోంది. చివరికి ఆదినారాయణరెడ్డి రాజకీయ ప్రయాణం ప్రశ్నార్ధకంగా మారింది..!

Related Posts