రైతు భరోసా జాబితాలో మాజీ మంత్రి పేరు

by CNN TELUGU
0 comment

ఏపీలో రైతు భరోసా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. పెట్టుబడి సాయం కింద రైతులకు రూ.13,500 ప్రభుత్వం అందిస్తోంది. దాదాపు 40 లక్షలమందికిపైగా రైతులు లబ్దిదారులుగా గుర్తించారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు రైతు భరోసా వర్తించదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం.. రైతు భరోసా జాబితాలో మాజీ మంత్రి  పేరు ప్రత్యక్షం కావడం షాక్ ఇచ్చింది.

రైతు భరోసా జాబితాలో తన పేరు ఉండటంతో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ.. ఈ లేఖ రాశారు. వెంటనే తన పేరును తొలగించాలని కోకారు. అంతేకాదు జాబితాలో పేరు రావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ కూడా విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లాలోనే మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేరు కూడా రైతు భరోసా జాబితాలో ఉంది. దీనిపై స్పందించిన మంత్రి.. తన పేరు పొరపాటున వచ్చి ఉండొచ్చని.. ఒకవేళ డబ్బు అకౌంట్‌లో వేసినా తిరిగి ప్రభుత్వానికి అందజేస్తానని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఎక్కడ తప్పు జరిగిందో అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పేరు కూడా జాబితాలో రావడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.

Related Posts