కమలంలో విరిసిన పచ్చ పువ్వు

by CNN TELUGU
0 comment
సుజనా చౌదరి కమల వనంలో విరిసిన పచ్చ పుష్పమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

గురువారం తాదేపల్లిలోని రాష్ట్ర వై.ఎస్.సి.పి. కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ.. రివర్స్ టెండరింగ్‌లో వందల కోట్లు మిగిలిన సంగతి సుజనా చౌదరికి కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.

గతంలో మేఘా కంపెనీకి చంద్రబాబు కాంట్రాక్టులు ఇవ్వలేదా అని, పీపీఎల్లో వందల కోట్లు కమీషన్ పేర్లతో నొక్కేసారని, టీడీపీలో పొలవరం పేరుతో వందల కోట్లు మింగిన నేతలు ఉన్న సంగతి ఈ పచ్చ పుష్పంకు కనిపించపోవటం విడ్డూరంగా వుందని అంబటి రాంబాబు విమర్శించారు.

Related Posts