ఆర్టిసీ కార్మికులకు బకాయిలు వెంటనే చెల్లించాలి

by CNN TELUGU
0 comment

ఆర్టిసీ జెఏసితో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు ఈనెల 30 లోగా 2013 వేతన సవరణ బకాయిలు 40 శాతంను వెంటనే చెల్లించాలని, ఏపిఎస్ ఆర్టిసీ ఉద్యోగులకు 01-04-17 నుండి జరగాల్సిన వేతనాల సవరణ జరపాలని, అలాగే 2013 వేతనాల సవరణకు సంబందించి పెండింగు ఉన్న బకాయిలు చెల్లించాలని ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అద్యక్షులు వై.వి.రావు,ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు.

2019 పిభ్రవరి 6 నుండి గుర్తింపు సంఘం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆద్వర్యంలో ఏర్పడిన జెఏసి సమ్మెకు సిద్దపడగా అప్పటీ రవాణామంత్రి కింజరాపు అచ్చెం నాయుడు ఆద్వర్యంలో పిభ్రవరి 5 న జెఏసితో చెసుకున్న ఒప్పంద మేరకు పెండింగులో ఉన్న 80 శాతం బకాయిలు మే 23 న చెల్లించారని, మిగిలిన 40 శాతం అరియర్సు జెఏసితో చేసుకున్న ఒప్పందం మేరకు ఈనెల 30 న చెల్లించాల్సి ఉందని, కావున 2013 కు సంబందించిన అరియర్సును వెంటనే చెల్లించాలని ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ ఆ ప్రకటనలో కోరారు.

అయితే కార్మికులకు ప్రస్తుతం ఏ చెల్లింపులు చేయాలన్నా ప్రభుత్వం నుండి రావల్సి బడ్జెట్ కేటాయింపులు వస్తేనే ఇవ్వగలమని యాజమాన్యం చేతులెత్తేసిందని కావున ప్రభుత్వం ఆర్టీసికీ కేటాయించిన నిదులు వెంటనే మంజూరు చేయాలని దామోదరరావు, వై.వి.రావు ఆ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

Related Posts