‘మహా’ ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్

by CNN TELUGU
0 comment

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత పవార్ తో భేటీ కావటం.. మహారాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయనతో చర్చలు జరిపానే తప్పించి మరింకేమీ లేదన్న ఆయన.. అనూహ్యంగా వేసిన ఎత్తుతో శివసేన చిత్తు అయ్యింది. అధికారం తమ చేతి నుంచి చేజారేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని మోడీషాలు.. తాజాగా తామేమిటన్నది మహారాష్ట్ర విషయంలో చేతల్లో చేసి చూపించారు.

శుక్రవారం రాత్రి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే బాధ్యతలు స్వీకరిస్తారని పవార్ స్వయంగా ప్రకటించిన గంటల వ్యవధిలోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం.. శనివారం ఉదయం (8.30 గంటల సమయానికే) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్రఫడ్నవీస్ ప్రమాణస్వీకారం పూర్తి కావటం షాకింగ్ గా మారింది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు.

శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకూ చోటు చేసుకున్న వరుస పరిణామాలతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. శివసేనతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని..ఐదేళ్ల పాటు ఉద్దవ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని.. సీఎం పదవిని పంచుకునే మాట తమ చర్చల్లో రాలేదన్న పవార్.. రాత్రికి రాత్రే ప్లేట్ మార్చేయటమే కాదు.. తెల్లారేసరికి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేశారు.

ఒకవైపు సేనతో చర్చలు జరుపుతూనే.. మరోవైపు ప్లాన్ బీ అన్న రీతిలో తమ పార్టీ నేత అజిత్ పవార్ తో కలిసి బీజేపీతో రహస్య మంతనాలు జరిపిన పవార్.. చివరకు మహారాష్ట్ర ఎపిసోడ్ కు అనూహ్య ముగింపు ఇవ్వటం గమనార్హం. రాత్రికి రాత్రి చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉందన్నారు. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. మహారాష్ట్ర ప్రజల సమస్యల్ని తాము పరిష్కరిస్తామని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.

తన చర్యతో రాజకీయం అంటే ఎలా ఉంటుందో శివసేనకు మోడీషాలతో పాటు పవార్ కూడా కలిసి షాకిచ్చినట్లైంది. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవీస్ కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయటంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తేసినట్లు గవర్నర్ పేర్కొన్నారు.  చప్పుడు చేయకుండా అధికారాన్ని సొంతం చేసుకున్న మోడీషా వ్యూహం ఇచ్చిన షాక్ శివసేనకు దిమ్మ తిరిగేలా చేస్తుందని చెప్పక తప్పదు.

Related Posts