శనివారం ‘బాబు ఇల్లు కూల్చివేత’ తప్పదా..?

by CNN TELUGU
0 comment
లింగమనేని రమేష్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో కృష్ణానది ఒడ్డున ఉండవల్లి కరకట్ట పక్కన అక్రమ కట్టడంలో నివాసముంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిని శనివారం కూల్చివేతకు సీఆర్డీయే అధకారులు రంగం సిద్దమైనట్లు తెల్సింది.

లింగమనేని రమేష్ కు చెందిన అక్రమ నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాలని సీఆర్డీఏ అధికారులు ఇచ్చిన నోటీసులు తుది నోటీసులు కావడంతో ఈ శుక్రవారంతో గడువు ముగుస్తుంది. శనివారం కూల్చివేత ప్రక్రియ చేపట్టేందుకు సీఆర్డీయే అధకారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

చంద్రబాబు ఇంటికి సమీపంలో ఉన్న పాతూరి కోటేశ్వరరావు నిర్మించిన ర్యాంపును అధికారులు ముందుగా కూల్చివేశారు. సమీపంలో ఉన్న మిగిలిన నాలుగు నిర్మాణాలపైనా అధికారులు దృష్టిపెట్టారు. వీటిలో చంద్రబాబు నివాసం కూడా ఉందని అనధికార వర్గాలు తెలిపాయి.

బాబు నివాసాన్ని ఎప్పడు కూల్చివేస్తారనే విషయాన్ని అధికారులు అత్యంతగోప్యంగా ఉంచుతున్నారు. దీంతో కరకట్ట ప్రాంతంలో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది.

Related Posts