ఏపిలో కర్ఫ్యూ పొడిగింపు..

by CNN TELUGU
0 comment

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూని ఈనెల 30 వరకు పొడిగించమని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

సోమవారం ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు, కరోనా కేసులపై కమిటీ ప్రధానంగా చర్చ జరిగింది.

ఏపీలో రేపటితో కర్ఫ్యూ ముగియనుంది. ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి 12 వరకు కర్ఫ్యూ నుంచి సడలింపును ప్రభుత్వం ఇచ్చింది. పాజిటివిటీ రేటు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సడలింపును మరింత కుదించే యోచనలో ప్రభుత్వం ఉందని వార్తలు వచ్చినప్పటికీ ఆ కర్ఫ్యూనే నెలాఖరు వరకు(మే 30) ప్రభుత్వం పొడిగించింది.

మెరుగైన ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందని, అలాగే రూరల్ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు.

అలాగే కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. వారిని ఆదుకునేలా ఆర్థిక సహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. చిన్నారుల పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చుల కోసం వినియోగించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు.

Related Posts

Leave a Comment