ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు : ఎస్పీ

by CNN TELUGU
0 commentకోవిడ్ చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులే.. ఆసుపత్రులను సీజ్ చేస్తాం – ప్రాంతీయ విజిలెన్సు అండ్ ఇన్ఫోర్మెంట్ అధికారి ఎస్. పి . కనకరాజు హెచ్చరిక

విజయవాడ , మే, 10 : కోవిడ్ చికిత్సకు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులడాక్టర్లపై పై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆసుపత్రులను సీజ్ చేస్తామని ప్రాంతీయ విజిలెన్సు అండ్ ఇన్ఫోర్మెంట్ అధికారి ఎస్. పి. కనకరాజు హెచ్చరించారు.

స్థానిక చుట్టుగుంట లోని అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ పై తాడేపల్లి కి చెందిన వై. రవి తనకు సోదరుడు వరస ఐన వై. వెంకట రత్నంకు కోవిడ్ పాజిటివ్ రావడంతో చుట్టుగుంట లోని అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్లో ఈ నెల 4వ తేదీన జాయిన్ చేశామని, ఆ సమయంలో తన సోదరుడికి చాలా సీరియస్ గా ఉన్నాడని, చికిత్సకు 4 లక్షలు అవుతాయని డాక్టర్లు తెలిపాడన్నారు. ముందుగా 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించామని, 10వ తేదీ సోమవారం తన సోదరుడికి వ్యాధి నయం అయిందని, 2.50 లక్షల రూపాయలు చెల్లించి తీసుకువెళ్లవచ్చని ఆసుపత్రి సిబ్బంది చెప్పారన్నారు. తానూ 4 లక్షల రూపాయలకు అడ్వాన్స్ గ చెల్లించిన 2 లక్షలు మినహా మిగిలిన 2 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉన్నదని చెప్పినప్పటికీ ఆసుపత్రి యాజమాన్యం ఒప్పుకోకుండా 2 లక్షల 50 వేల రూపాయలు కట్టవలసిందేనని డిమాండ్ చేసి బెదిరించారన్నారు.

దీంతో చేసేదేమిలేక అధికారులకు ఫిర్యాదు చేయవలసి వచ్చిందని రవి చెప్పారన్నారు. రవి చేసిన ఫిర్యాదుపై స్పందించి తమ ప్రత్యేక బృందం లోని సభ్యులు విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ సి.ఐ అశోక్ రెడ్డి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఉషారాణి, డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలు నాయక్ లతో రికార్డులు తనికీ చేశామన్నారు.

తమ తనిఖీలో ఆసుపత్రి యాజమాన్యం నిబంధనలను అతిక్రమించి కోవిడ్ రోగులనుండి చికిత్సకు అనధికారికంగా అధికమొత్తంలో వసూలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ యాజమాన్యంపై మాచవరం పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశామని కనకరాజు చెప్పారు. అంతే కాక సదరు ఆసుపత్రిలో 30 పడకల సామర్ధ్యంతో కోవిడ్ రోగులకు చికిత్సకు అనుమతి పొందారని, ఆసుపత్రిలో 9 మంది రోజులు చికిత్స పొందుతున్నప్పటికీ, బెడ్స్ ఖాళీ లేవని చూపుతున్నారన్నారు.

గతంలో కూడా ఈ ఆసుపత్రిపైఅధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై స్పందించి తనికీలు నిర్వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్, ఆరోగ్యశ్రీ సి.ఈ.ఓ లు 2 లక్షల రూపాయలు పెనాల్టీ విధించారన్నారు.

జిల్లాలో ఎక్కడైనా కోవిడ్ చికిత్సకు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసి ఆసుపత్రులపై ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రాంతీయ విజిలెన్సు అండ్ ఇన్ఫోర్మెంట్ అధికారి ఎస్. పి . కనకరాజు తెలియజేసారు.

Related Posts

Leave a Comment