దేశంతో పోలిస్తే హైదరాబాదులోనే కరోనా కేసులు తక్కువ : సీపీ అంజనీ కుమార్

by CNN TELUGU
0 comment

భారతదేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఒక్క హైదరాబాదులోనే కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.

అలాగే మరణాల రేటు కూడా తక్కువగా ఉందని… ప్రజలంతా మరికొన్ని రోజుల పాటు లాక్ డౌన్ పాటిస్తే… ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మంగళవారం ఆయన ఈస్ట్ జోన్ పరిధిలోని అంబర్ పేట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలను నిర్వహించారు.

ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ… ఈస్ట్ జోన్ పరిధిలో 25 చెక్ పోస్టులు ఉన్నాయని జాయింట్ సీపీ రమేశ్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు. కేవలం అత్యవసర వాహనాలు, ముందస్తు అనుమతులు ఉన్న వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. నిత్యం ఎంతో మంది అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారని రోజుకు సరాసరి 8 వేల మందిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.

అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. ఈ-పాస్ లను దుర్వినియోగం చేస్తున్నవారు కూడా అధికంగా ఉన్నారని ఇక ఉపేక్షించమని కఠినంగా చర్యలు చేపడతామని సిపి చెప్పారు.

Related Posts

Leave a Comment