ఆదివారం నుండి పశ్చిమ బెంగాల్ లో సంపూర్ణ లాక్ డౌన్

by CNN TELUGU
0 comment

బెంగాల్ లో గడిచిన 24 గంటల్లో 20 వేలకు పైగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయంటే కరోనా ఉదృతి ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కరోనా ఉదృతి కట్టడి చేసేందుకు తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లాక్ డౌన్ బాటపట్టింది. రేపటి నుండి మే 30 వరకు సంపూర్ణ లాక్ డౌన్ కు ఆదేశాలు జారీచేసింది.

ఎన్నికల కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఆదివారం ఉదయం ఆరుగంటల నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. అయితే నిత్యవసరాల కోసం రోజుకి మూడు గంటలు షాపులు తెరిచి ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతులిచ్చింది. బస్సులు, రైళ్లు, కోల్‌కతాలో మెట్రో సేవలు నిలిచిపోనున్నాయి. విద్యాసంస్థలు కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల చివరి వరకూ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా పయనిస్తున్నాయి.

Related Posts

Leave a Comment