డీజీపీ సవాంగ్‌కు చంద్రబాబు ఘాటు లేఖ

by CNN TELUGU
0 comment

డీజీపీ గారూ.. ఐ యామ్ సారీ టు సే..
లా అండ్ ఆర్డర్ పడిపోయింది.
మీడియా గొంతును నొక్కుతున్నారు.
ప్రతిపక్షాలపైనే పోలీసులు కేసులు పెడుతున్నారు.
అధికార పార్టీ వారిపై పోలీసు కేసులు లేవు.

ఎపి డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఘాటుగా లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనంత స్ధాయికి లా అండ్ ఆర్డర్ పడిపోయిందని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని రాష్ట్రంలో శాంతి భద్రతలు విషయంలో ప్రభుత్వం మీడియా గొంతు నొక్కుతోందని ఆ లేఖలో ప్రస్తావించారు.

4 నెలల నుంచి రాష్ట్రంలో ఎవరికీ మాట్లాడే స్వేఛ్చ లేకుండా పోయిందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయన్నారు. ఇటీవల చీరాలలో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై హత్యాయత్నం దాడి చేశారు. ఆమంచి కుటుంబం మీద ప్రకాశం ఎస్పీకి ఫిర్యాదు చేసిన రోజే నాగార్జున రెడ్డి కిడ్నాప్‌నుకు గురయ్యాడు. ప్రస్తుతం నాగార్జున రెడ్డి ఆస్పత్రిలో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని వైసీపీ ప్రభుత్వం ఎమ్‌ఎస్‌ఓలను బెదిరించి న్యూస్ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేశాయని, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల మీద అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

ప్రతిపక్షాలకు చెందిన వారిపై మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున కేసులు పెడుతున్నారని అధికార పార్టీ కార్యకర్తల మీద పోలీసులు కేసులు పెట్టడం లేదని చంద్రబాబు ఆరోపించారు. ‘సత్యమేవ జయతే’ అనే నినాదాన్ని అనుసరించి రాష్ట్రంలో పోలీసులు శాంతిభద్రతలను పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి చంద్రబాబు ఆలేఖలో గుర్తుచేశారు.

Related Posts