ఫ్లై ఓవర్‌పై నుంచి కిందపడ్డ కారు – సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యం

by CNN TELUGU
0 comment

బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ఈ వారంలో వరుసగా రెండో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.

హైదరాబాద్‌ బయె డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. ఓ కారు అదుపు తప్పి ఫ్లైఓవర్‌ పైనుంచి పల్టీలు కొట్టి కింద పడింది. అదే సమయంలో ఫ్లైఓవర్‌ కింద ఆటో కోసం వేచి చూస్తున్న ఓ మహిళపై కారు పడటంతో ఆమె స్పాట్‌లోనే ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ఓవర్ స్పీడ్ వల్ల ప్రమాదం జరిగిందా.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల అడిగి ఏం జరిగిందో తెలుసుకున్నారు.

మరోవైపు ఈ ప్రమాదంపైమేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై వేగాన్ని నియంత్రించేందుకు చేపట్టే చర్యల కోసం మూడు రోజులపాటు రాకపోకలు నిలిపి వేశారు.

Related Posts