ఏపీలో రైతు రుణమాఫీ పథకం రద్దు

by CNN TELUGU
0 comment

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాది మార్చి 10 తేదీన జారీ చేసిన జీవో నెంబరు 38ని రద్దు చేస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు.

రుణమాఫీకి సంబంధించి 4-5 విడతల్లో ఇవ్వాల్సిన 7959.12 కోట్ల ను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 4, 5 విడతల్లో చెల్లించాల్సిన మొత్తంతో పాటు 10 శాతం వడ్డీ కలిపి 7959.12 కోట్లు చెల్లింపులకు సంబంధించి జీవో నెంబరు 38 గత టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం ఆ జీవోను రద్దు చేస్తూ తాజాగా ఆదేశాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Related Posts