బెయిలు రాదనే కొత్త నాటకం..! ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర : మిథున్‌రెడ్డి

by CNN TELUGU
0 comment

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు దెబ్బలు తగల్లేదని ఎవరూ కొట్టలేదని హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో వైద్యులు పేర్కొన్నారని వైకాపా లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి చెప్పారు.

తనను కొట్టారంటూ రఘురామ కుట్ర చేస్తున్నారని.. బెయిల్ రాలేదని తెలిసే ఆయన కొత్త నాటకానికి తెరతీశారని..తెదేపా అధినేత చంద్రబాబు చెప్పినట్లుగానే రఘురామకృష్ణరాజు పనిచేస్తున్నారని మిథున్‌రెడ్డి ఆరోపించారు.

జగన్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని ఈ వ్యవహారాలను లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తామని మిథున్‌రెడ్డి వివరించారు.

తెలుగుదేశం పార్టీ నేతలు అరెస్టు అయినా రాష్ట్రపతికి చంద్రబాబు ఏ రోజు లేఖలు రాయలేదని పెద్ద కుట్రతోనే ఆయన ఇప్పుడు లేఖ రాశారని మిథున్‌రెడ్డి విమర్శించారు.

Related Posts

Leave a Comment