హిందూ దేవాలయాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

by CNN TELUGU
0 comment

హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులు, హిందూయేతర వ్యక్తులను నియామకంపై గతంలో పలు విమర్శలు వచ్చిన నేపధ్యంలో, హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవోను జారీ చేసినట్లు తెలిసింది.

అన్యమతస్తులకు ఎట్టిపరిస్థితుల్లోనూ హిందూ దేవాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వొద్దని ఆజీవోలో పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు ఈ నిబంధన వర్తిస్తుందని కూడా తెలిపింది. ప్రస్తుతం హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న అన్యమతస్తులను వేరే శాఖలకి బదిలీచేయాలని ప్రభుత్వం ఆ జీవోలో స్పష్టం పేర్కొంది.

ఒకవేళ అన్యమతంలో కొనసాగుతూ హిందూ దేవాలయాల్లో విధులు నిర్వహిస్తుంటే విజిలెన్స్ కు సమాచారం అందించాలని, సదరు ఉద్యోగుల ఇళ్లల్లో జరిగే పండుగలు, పెళ్లిళ్లు, ప్రార్థనలకు సంబంధించిన వీడియోలను విజిలెన్స్‌ శాఖకు అందిస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. కాగా చంద్రబాబు హయాంలోనే అన్యమతస్తులను దేవాలయ విధుల్లో నియమించినట్టు తేలింది. ఈ నేపథ్యంలోనే వారందరిని తొలగించాలన్న డిమాండ్ వినిపించటంతో వైసీపీ ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతొ హిందూ దేవాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts