అంబులెన్స్ లకు అనుమతి లేదు..! ఎంపీ అరెస్ట్ కు అనుమతులు ఇస్తారా..? బండి సంజయ్ వ్యాఖ్యలు..

by CNN TELUGU
0 comment

నరసాపురం ఎం.పి రఘు రామ రాజు అరెస్ట్ పై తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎం.పి బండి సంజయ్ వ్యాఖ్యలు…

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎం.పి రఘురామ కృష్టం రాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసిన తీరు చాలా దారుణంగా ఉంది. ఒక ఎంపీని ఈడ్చుకెళ్తు, బలవంతంగా కారులోకి తోస్తారా..?

ఒక గౌరవ ఎంపీని ఏపీ పోలీసులు అరెస్టు చేయడానికి గౌరవ లోక్ సభ స్పీకర్ అనుమతి లేకున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఏవిధంగా అనుమతించింది..?

తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన కొనసాగుతోందా లేక తమ మిత్రుడైన ఏపీ సీఎం కోసం అన్నీ నిబంధనల్ని తుంగలోకి తొక్కి నియంతృత్వ పాలన చేస్తున్నారో అర్థం కావట్లేదు..!

మఫ్టీలో వచ్చిన వాళ్ళను చూస్తుంటే పోలీసులో, కిడ్నాపర్లో అర్థం కాలేదు. ఎంపీని కిడ్నాప్ చేశారో, అరెస్టు చేశారో ఆయన కుటుంబ సభ్యులకు కొద్దిసేపు అర్థం కాలేదంటే పరిస్థితి ఎంత దారుణమో.. తెలుస్తోంది.

రఘురామ కృష్ణంరాజుకి 4 నెలల కిందట హార్ట్ సర్జరీ అయింది. ఒక హార్ట్ పేషెంట్ తో పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా..?

ప్రాణాలను అరచేత పట్టుకుని హైదరాబాద్ హాస్పిటళ్ళకు వస్తున్న ఏపీ అంబులెన్సులను బార్డర్ లో ఆపేస్తున్న తెలంగాణ సర్కార్, ఒక గౌరవ ఎంపీని అరెస్టు చేసేందుకు ఏవిధంగా ఏపి పోలీసులను రాష్ట్రంలోకి అనుమతించింది..?

వేరే రాష్ట్రం నుంచి వస్తున్న అంబులెన్సులను ఎందుకు ఆపారని గౌరవ హైకోర్టు చీవాట్లు పెట్టినా ఈ ప్రభుత్వానికి బుద్ధిరాలేదు..

లాక్ డౌన్ నిబంధనలను అధిగమించి, కరోనా వ్యాప్తిని పట్టించుకోకుండా పదుల సంఖ్యలో ఏపీ సీఐడీ పోలీసులను ఇంత అత్యవసరంగా రాష్ట్రంలోకి అనుమతించాల్సిన అవసరం ఏమి ఉంది..?

కొన్నాళ్లు ఆగితే రఘు రామకృష్ణం రాజు దేశం వదిలి పారిపోతారా..?

గౌరవ ఎంపీకి ఎన్నో రకాల ప్రివిలేజేస్ ఉంటాయని ఏపీ, తెలంగాణ పోలీసులకు తెలియదా..?

ఒక ఎంపీని అరెస్టు చేయాలంటే గౌరవ స్పీకర్ అనుమతి తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం ఏపీ పోలీసులకు లేకున్నా, మన రాష్ట్రంలో ఉన్న ఎంపీని ఎట్లాంటి వారెంట్ లేకుండా ఆ పోలీసులకు ఏవిధంగా అప్పగించింది..?

రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోలేక రెండు రాష్ట్రాల సీఎంలు ఇట్లాంటి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారు..

కరోనా నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సమన్వయం కుదరడం లేదు..

కానీ, రాజకీయ రాక్షస క్రీడలో మాత్రం రెండు రాష్ట్రాల సీఎంలు మంచి సమన్వయంతో పనిచేసుకుంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు..

Related Posts

Leave a Comment