వ్యక్తిని 8 కిలోమిట్లరు’ఈడ్చుకెళ్లిన క్యాబ్’

by CNN TELUGU
0 comment
హైదరాబాద్‎లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రముఖ సంస్థ క్యాబ్ డ్రైవర్ వ్యక్తిని ఢీకొట్టి 8 కిలోమిట్లరు ఈడ్చుకెళ్లి ఘటన శంషాబాద్‎లో జరిగింది. మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు ఓ క్యాబ్ డ్రైవర్ నోపార్కింగ్ జోన్‌లో కారును నిలిపిపాడు.

యాదయ్య అనే ప్రయాణికుడిని ఎక్కించుకుంటున్న సమయంలో.. పోలీసు వాహనం రావడాన్ని గమనించాడు. దీంతో కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో యాదయ్య చోక్కా కారు డోరులో చిక్కుకుపోయింది. బాధితుడు ఎంతగా అరుస్తున్నా డ్రైవర్ వినిపించుకోలేదు. పోలీసులు వెంబడిస్తున్నారన్న కంగారులో డ్రైవర్ పట్టించుకోకుండా కారును నడిపాడు. అలా దాదాపు 8 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత శంషాబాద్ టోల్‌గేట్ వద్ద సిబ్బంది గమనించి విషయం డ్రైవర్‌కు చెప్పాడు. అప్పటికే యాదయ్య ప్రాణాలు విడిచాడు, దీంతో డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారైయ్యాడు. స్థానికులు సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నంబర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు.

Related Posts