ఈనెల 26న ఉదయ్‌ రైలు ప్రారంభం

by CNN TELUGU
0 comment

విశాఖ : కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ హఠాన్మరణంతో వాయిదాపడిన విశాఖ – విజయవాడ మధ్య తిరిగే ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈనెల 26న ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం వాల్తేరు డివిజన్‌కు సమాచారం అందినట్లు తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రైలును రైల్వే సహాయ మంత్రి సురేష్‌ చెన్నబసప్ప అంగాడి అదే రోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో జెండా ఊపి విశాఖ నుంచి ప్రారంభిస్తారన్న విషయాన్ని వాల్తేరు అధికారులు తెలిపారు చేశారు. ఈ కార్యక్రమం కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రైలు విశాఖలోని యార్డులో గత రెండు నెలలుగా ఖాళీగానే ఉంది.

Related Posts

Leave a Comment