సుప్రీంకోర్టుకు కేసీఆర్..!

by CNN TELUGU
0 comment

హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ.. సుప్రీంకి వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.‘కొత్త అసెంబ్లీ’నిర్మాణంపై వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఎర్రమంజిల్‌ భవనాలను కూల్చొద్దని.. అది.. వారసత్వ ఆస్తి కట్టడాలని భావించిన హైకోర్టు ఇటీవలే.. ఆ కేసు కొట్టి వేసింది. పాత అసెంబ్లీనే.. కొనసాగించుకోవాలని.. కేసీఆర్‌కు చురకలంటించింది. కొత్త అసెంబ్లీకి సంబంధించి రాష్ట్ర కేబినెట్ తీర్మానాన్ని కూడా రద్దు చేసింది. కాగా.. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్.. నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ తీర్పు ఇవ్వడంతో.. ఫుల్ బెంచ్‌కు వెళ్లినా ప్రయోజనం ఉండదని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది.ఈ విషయంపై నిపుణులతో సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరుపి సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.

Related Posts

Leave a Comment