సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైశ్వాల్

by CNN TELUGU
0 comment

మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను సీబీఐ కొత్త డైరెక్టర్ గా త్రిసభ్య కమిటీ ఎంపిక చేసింది. మొత్తం 109 మందిని వడపోసిన త్రిసభ్య కమిటీ. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురిలతో కూడిన త్రిసభ్య కమిటీ సుదీర్ఘ వడపోత అనంతరం జైశ్వాల్‌ను ఎంపిక చేసింది.

నిజానికి సీబీఐ నూతన డైరెక్టర్ పదవి రేసులో సుబోధ్ కుమార్ ముందు వరసలోనే ఉన్నారు. ఈరేసులో సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ కేఆర్ చంద్ర, కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి వీఎస్కే కౌముది కూడా పోటీలో నిలిచినప్పటికీ సుబోధ్ కుమార్ అత్యంత సీనియర్ కావడంతో ఆయనకే ఈ పదవి దక్కింది. రిషికుమార్ శుక్లా ఫిబ్రవరిలోనే పదవీ విరమణ చ హేసారు. అప్పటి నుంచి ఇన్ చార్జి లతోనే సీబీఐ డైరెక్టర్‌ ను కొనసాగించారు. కేంద్రప్రభుత్వం చొరవతో పూర్తిస్థాయి సీబీఐ డైరెక్టర్ ను నియమించింది. సుబోధ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.

Related Posts

Leave a Comment