సీపీఎస్ రద్దు చేస్తామని ఉద్యోగుల్ని పచ్చిగా మోసగించారు : నాదెండ్ల

by CNN TELUGU
0 comment

సీపీఎస్ రద్దు విషయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి టెక్నికల్ గా మడమ తిప్పి ప్రభుత్వ ఉద్యోగులను నిలువునా ముంచారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేస్తామని పాదయాత్రలో హామీలు గుప్పించి, మేనిఫెస్టోలో చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పచ్చిగా మోసం చేశారన్నారు. కేవలం ఉద్యోగుల ఓట్లు, మద్దతు కోసమే అబద్ధాలు చెప్పారు.

ఇప్పుడు ‘మాకు సాంకేతికపరమైన అంశాలు తెలియక హామీ ఇచ్చాం’ అనడం జగన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతారహిత్యాన్ని వెల్లడిస్తోందన్నారు. సీపీఎస్ రద్దు హామీని నీటి మీద రాతలా మార్చడంపై సలహాదారులు సన్నాయి నొక్కులు నొక్కడం కాకుండా… ముఖ్యమంత్రే స్వయంగా సమాధానం చెప్పి తాము తప్పుడు హామీ ఇచ్చామని అంగీకరించాలనీ నాదెండ్ల డిమాండ్ చేశారు.

Related Posts