సీఎం… మాజీ సీఎం ఒకే వేదికపై

by CNN TELUGU
0 comment

బెంగళూరు: అభిమానులు కేరింతలు కొట్టారు… రాష్ట్ర అగ్రనేతలు ఒకే వేదికను పంచుకున్నారు.. ఎటువంటి పరిణామాలు తలెత్తనున్నాయో ఎటువంటి విమర్శలు చేసుకోనున్నారోనని అందరూ భయపడ్డారు. కానీ సిద్దరామయ్యను ఆప్యాయంగా యడియూరప్ప స్వాగతించడంతో అంతా ఊపిరి పేల్చుకున్నారు. వసంతనగర్‌లో వాణిజ్యపరిశ్రమల శాఖ అధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రైజస్‌, ఇండస్ట్రియల్‌ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో పారిశ్రామిక చైతన్య కార్యక్రమం జరిగింది. సుధీర్ఘకాలం తర్వాత రాష్ట్ర అగ్రనేతలు సీఎం యడియూరప్ప మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యలు ఒకే వేదికను పంచుకున్నారు. యడియూరప్ప సమావేశానికి సకాంలోనే హాజరుకాగా కాస్త ఆలస్యంగా వచ్చిన సిద్దరామయ్యకు ఎదురునిలబడి ముఖ్యమంత్రి స్వాగతించారు. సీఎం కార్యక్రమాన్ని లాంఛనంగా స్వాగతించగా యడియూరప్ప ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల ప్రగతి అనే పుస్తకాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో డీఎసీఎం గోవిందకారజోళ, బీఎస్‌పీ ఎమ్మెల్యే మహేష్‌, పరిశ్రమల శాఖామంత్రి జగదీశ్‌శెట్టర్‌, రాజ్యసభ సభ్యుడు హనుమంతయ్యలు పాల్గొన్నారు..

Related Posts