శివరామే కోడెలను హత్య చేశాడు..కోడెల మేనల్లుడు సంచలన ఆరోపణలు

by CNN TELUGU
0 comment

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపై ఆయన మేనల్లుడు కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేశారు. కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్య చేశాడని కంచేటి సాయి ఆరోపించారు. ఆత్య చేయించి..ఆత్మహత్యగా చీత్రీకరించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్య చేశాడని వ్యాఖ్యానించారు. శివారం తనను శారీరకంగా, మానసికంగా చాలాకాలం నుంచి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని శివప్రసాద్‌ తనతో అనేకసార్లు చెప్పినట్లు సాయి తెలిపారు. కోడెల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి ఆయన కోరారు.

కోడెల పేరుతో ఉన్న ఆస్తులను తన పేరిట రాయాలని శివరాం బెదిరిస్తున్నాడు. కొడుకు శివరాం నుంచి ప్రాణహాని ఉంది.. కాపాడమని కోడెల వేడుకున్నారు. కొడుకు శివరాం ఆయనను చంపి లేదా చంపించి ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్లు మాకు అనుమానం ఉంది.

Related Posts

Leave a Comment