వైద్యం కోసం వచ్చిన యువతిపై ఆపరేషన్ థియేటర్లో కాంపౌండర్.. ఏం చేశాడంటే..

by CNN TELUGU
0 comment

వైద్యం కోసం వచ్చిన యువతిపై ఆపరేషన్ థియేటర్లో కాంపౌండర్.. ఏం చేశాడంటే..
వైద్య సేవలు చేయాల్సిన కాంపౌండర్ కామపిశాచిలా మారిన ఘటన యూపీలోని మథురలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. అయితే చికిత్స కోసం స్థానికంగా ఉన్నటువంటి ఓ ఆసుపత్రిలో చేరింది. అక్కడ కాంపౌండర్ గా పనిచేస్తున్న రాజు (పేరు మార్పు) ఆమెపై కన్నేశాడు. డాక్టర్ రావడానికి లేట్ అవుతుందని, లోపల ఖాళీగా ఉన్న ఆపరేషన్ థియేటర్ గదిలో వెయిట్ చేయమని కోరాడు. అందుకు ఆ బాలిక సరేనన్నది.

ఎంతసేపటికి డాక్టర్ రాలేదు. అయితే అనుమానంతో బాలిక కాంపౌండర్ ను డాక్టర్ ఎప్పుడు వస్తాడని అడిగింది. డాక్టర్ బిజీగా ఉన్నారని ఇంకాసేపు వెయిట్ చేయాలన్నాడు. కాసేపు అయ్యాక యువతి తనకు కడుపు నొప్పి ఎక్కువగా ఉందని కాంపౌండర్ తొ చెప్పగానే, ఇంజక్షన్ తీసుకుంటే నొప్పి తగ్గుందని, ఇస్తానని అన్నాడు. యువతి అనుమానంగానే ఇంజెక్షన్ ఇచ్చేందుకు ఒప్పుకుంది. అయితే ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే యువతి స్పృహ కోల్పోయింది. ఇదే అదనుగా భావించిన ఆ కీచకుడు యువతిపై లైంగిక దాడికి చేశాడు. నెమ్మదిగా మత్తులోనుంచి బయటపడిన యువతి జరిగిన ఘోరంతో నిర్ఘాంతపోయింది. వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Related Posts