యురేనియం తవ్వకాలపై మంత్రి కేటీఆర్ ప్రకటన
హైదరాబాద్, సెప్టెంబరు : యురేనియం తవ్వకాలపై శాసనమండలిలో మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లాలో అన్వేషణ చేపట్టాం కానీ.. నాగర్కర్నూల్- అమ్రాబాద్ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. యురేనియం నిక్షేపాలు ఉన్నా అనుమతులు ఇవ్వబోమని, వన్యప్రాణుల సంరక్షణ విభాగం స్పష్టం చేసిందని మండలిలో కేటీఆర్ పేర్కొన్నారు.