యుద్ధం వస్తే.. ప్రపంచ పటంలో పాక్ ఉండ‌దు : కిషన్ రెడ్డి

by CNN TELUGU
0 comment

కాకినాడ: ఈసారి యుద్ధం వస్తే పాకిస్తాన్ దేశం ప్ర‌పంచ‌ పటంలో కనిపించదని కేంద్ర రక్షణ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక జేఎన్టీయూ లో ఆర్టికల్ 370పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జవహర్ లాల్ నెహ్రు ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు ఆర్టికల్ 370 ఏర్పాటు చేయడం జరిగిందని దాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి పార్టీ ఏర్పడింది అన్నారు.

ఎంఐఎం మూల పార్టీ రజాకర్లదే నని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 కి వ్యతిరేకంగా మా పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు బలిదాన మయ్యారు. ఆర్టికల్ 370 కారణంగా పాకిస్థాన్ తో నాలుగు యుద్ధాలు జరిగాయని తెలిపారు.

ఆర్టికల్ 370 వలన 42 వేల మంది చ‌ని పోయార‌ని తెలిపారు. ఒకే దేశం ఓకే ప్రధాని నినాదంతో ప్రధాన మంత్రి మోడీ ఆర్టికల్ 370 ను రద్దు చేయడం జరిగిందన్నారు. కాశ్మీరీ లో 370 కారణంగా మహిళా రిజర్వేషన్లు కాని, ఎస్సీ  రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు ఉండవన్నారు.

దేశం కోసం ఏ త్యాగమైనా చేస్తామన్నారు. ఈసారి యుద్ధ‌మంటూ వస్తే పాకిస్థాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తామన్నారు. ఇమ్రాన్ ఖాన్ తాటాకు చప్పుళ్ళకు జడిసే ప్రభుత్వం ఇక్కడ లేదన్నారు.

Related Posts

Leave a Comment